Saturday, November 16, 2024

విద్యుత్ రంగం ఆస్తి రూ. 1.37 లక్షల కోట్లు: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రస్తుతం రూ.81,516 కోట్ల అప్పుల్లో విద్యుత్ రంగం ఉందని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి శాసన సభలో మాట్లాడారు. తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని తెలియజేశారు. 2014 జూన్ 2 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తులు రూ. 44,434 కోట్లు ఉండగా, 2014 జూన్ 2 నాటికి రూ. 22,423 కోట్ల అప్పులు ఉన్నాయని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం విద్యుత్ రంగ ఆస్తలు విలువ రూ.1,37,570 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. మా పాలనలో విద్యుత్ సరఫరా నాణ్యతలు పెంచామని జగదీశ్ రెడ్డి ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News