Monday, December 23, 2024

చీకట్లోకి నెట్టే కుట్ర

- Advertisement -
- Advertisement -

అందుకే కొనుగోళ్లపై నిషేధం

కెసిఆర్‌కు మంచి పేరు రావడం ఇష్టంలేకనే పవర్ కట్ విద్యుత్
సంస్థలపై పెత్తనం ఎందుకు? ఇది రాష్ట్రాల జాబితాలోని అంశం
మోడీ ప్రభుత్వం తీరుపై మండిపడిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి

మన: విద్యుత్ సంస్థల పై కేంద్రప్రభుత్వం పెత్తనం ఎందుకనీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలో లేదని అయినా విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉం టుందని ఆయన స్పష్టం చేశారు. ఎనర్జీ ఎక్స్‌చేంజ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వి ద్యుత్ కొనుగోళ్లు, అమ్మకాలపై కేంద్రం నిషేధం విధించడంపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేరకు మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు పురపాలక సంఘం పరిధి లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించాల్సి వస్తే అది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ యన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోలు, అమ్మకాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు పొందిందని,అయినా కోర్టు తీర్పును ఉల్లంఘించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేందుకు బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఈ తరహా కుట్రలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం పేద,బడుగు, బలహీన,దళిత గిరిజనులకు అందించే సబ్సిడీలు ఎత్తి వేయాలన్నదే బిజెపి ఎజెండా అని ఆయన విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చి

విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాలు అన్నది పూర్తిగా ఆయా రాష్ట్రాల పరిధిలోనిదని లేని అధికారంతో రాష్ట్రాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం ఏమిటనీ ఆయన విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చి బకాయిల పేరుతో రాష్ట్రల హక్కులను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్రం చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కుడా బకాయి పడలేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అంతే కాకుండా ఇది పూర్తిగా డిస్కంలకు సప్లై దారులకు మధ్య కుదిరే ఒప్పందం మాత్రమేనని ఆయన తెలిపారు. వారిద్దరూ మధ్య తగవులు సంభవిస్తే పరిష్కరించేందుకు ఈఆర్‌సిలు లేదు అంటే కోర్టులు ఉన్నాయన్నారు. 2014కు ముందు తరువాత విద్యుత్ సరఫరా పరిస్థితి ఏమిటన్నది తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే విద్యుత్ సరఫరాను మెరుగు పరచిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దన్నారు.

దేశాభివృద్ధికి నష్టం కలిగించే ప్రమాదం…

అనతికాలంలోనే వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దక్కిందన్నారు. జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంచి పేరు రావడం ఇష్టం లేకనే రాజకీయ ప్రేరేపిత నిర్ణయం తీసుకుందన్నారు. యావత్ భారత దేశంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసే రాష్ట్రాంగా తెలంగాణ ఖ్యాతి గడించినందునే కేంద్ర ప్రభుత్వం ఈ తరహా ఆటంకాలు కల్పిస్తుందన్నారు. మోడీ సొంత రాష్ట్రంలోనూ ఈ తరహా సరఫరా లేక పోవడంతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉండడంతో విసిగిపోయిన ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారన్న భయంతోనే ఇటువంటి దుశ్చర్యలకు కేంద్రం పాల్పడుతోందన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత తోటి అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తల చూపు తెలంగాణ వైపు మళ్లడం కుడా కేంద్ర ప్రభుత్వ దుగ్దకు ఒక కారణంగా కనిపిస్తుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత చర్యతో రాష్ట్ర ప్రజల అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని, అది అక్కడితో ఆగకుండా దేశాభివృద్ధికి నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దేశద్రోహ పురతమైన నిర్ణయం తీసుకున్న బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై న్యాయ పరంగా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News