65 సీట్లలో విజయం బావుటా
39 స్దానాల్లో బిఆర్‌ఎస్ విజయం
8 చోట్ల బిజెపి, పాత 7 సీట్లు మజ్లిస్ ఖాతాలోకి
ఒక చోట ఉనికి చాటిన కమ్యూనిస్టులు
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో 2290 మంది అభ్యర్థులు పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి 65 మంది, బిఆర్‌ఎస్ నుంచి 39, బిజెపి తరుపున 08 మంది, మజ్లిస్ నుంచి 07 మంది, సిపిఐ నుంచి ఒకరు విజయ బావుటా ఎగుర వేశారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలో హస్తం పవనాలు వీచ్చాయి. అదే విధంగా బిఆర్‌ఎస్ పార్టీ గ్రామీణంలో తక్కువ సీట్లు గెలిచిన గ్రేటర్ పరిధిలోని మెజార్టీ సీట్లు తన ఖాతాలో వేసుకుంది. మజ్లిస్ పార్టీ ఎప్పటి మాదిరిగానే పాత సీట్లు పదిలంగా కాపాడుకుంది. కామ్రేడ్లు ఒక చోట పోటీ చేసి ఉనికి నిలబెట్టుకున్నారు. ఈఎన్నికల్లో స్వతంత్రుల ఉనికి పత్తా లేకుండా పోయి డిపాజిట్ కోసం పోరులో తలపడట్ల్లు స్పష్టమైంది.
బిజెపి విజయం సాధించిన అభ్యర్థులు …
1(7). ఆదిలాబాద్: పాయల శంకర్(67608) ప్రత్యర్ధి : జోగు రామన్న బిఆర్‌ఎస్(60916) మెజార్టీ:6692
2.(11) ఆర్మూర్: పైడి రాకేష్‌రెడ్డి(72658) ప్రత్యర్ధి: ప్రొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్)(42989)
మెజార్టీ:29669
3.(65), గోషామహల్: రాజా సింగ్(80182) ప్రత్యర్ధి: నందకిషోర్ వ్యాస్(బిఆర్‌ఎస్)(58725)
మెజార్టీ: 21457
4.(16) కామారెడ్డి:కాటిపల్లి వెంకటరమణరెడ్డి(66652) ప్రత్యర్ధి: కె. చంద్రశేఖర్‌రావు (బిఆర్‌ఎస్)(59911) మెజార్టీ: 6741
5.(10) ముథోల్: రామారావు పవార్(96799) ప్రత్యర్థి: జి. విఠల్‌రెడ్డి (బిఆర్‌ఎస్)(73380)
మెజార్టీ: 23419
6.(17) నిజామాబాద్ అర్భన్: దన్‌పాల్ సూర్యనారాయణ(75240) ప్రత్యర్ధి:మహ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్)(59853)
మెజార్టీ :15387
7.(9) నిర్మల్: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(106400) ప్రత్యర్థి: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(బిఆర్‌ఎస్)(55697)
మెజార్టీ: 50703
8.(1) సిర్పూర్: డా. పాల్వాయి హరీష్‌బాబు(63702) ప్రత్యర్ధి: కోనేరు కొనప్ప (బిఆర్‌ఎస్)(60614)
మెజార్టీ: 3088