Wednesday, January 22, 2025

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

- Advertisement -
- Advertisement -

మిండానావోలోని దక్షిణ ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దక్షిణ ద్వీపం మిండానావోలోని సారంగని రాష్ట్రంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉదయం 8.14 గంటలకు భూకంపం సంభవించింది. ప్రాణనష్టం గురించి తక్షణ నివేదికలు లేవని తెలిపింది.

అయితే పర్వత ప్రాంతంలో భూకంపాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇది అత్యంత శక్తివంతమైన భూకంపమని దావో సిటీకి చెందిన కీషియా లేరాన్ (27) ఓ సదస్సులో తెలిపారు. సదస్సులో చుట్టుపక్కల వారు ఆందోళనతో పరుగులు తీశారని అన్నారు. పసిఫిక్ మహాసముద్రానికి సమీపంలో ఉండటం వల్ల ఫిలిప్పీన్స్ భూకంపాలకు గురవుతుంది. అందుకే ఫిలిప్పీన్స్‌ను ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా అభివర్ణిస్తారు. భూకంపం కారణంగా ఎత్తైన భవనం పైన ఉన్న క్రేన్ నేలమీద పడింది. దవావో సిటీలోని భవనం పైభాగంలో నిర్మాణ సామగ్రి కూలిపోయినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News