Monday, January 20, 2025

అప్ఘానిస్థాన్ లో భారీ భూకంపం: 120 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కాబూల్: అఫ్గానిస్థాన్‌లో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి 120 మంది మృతి చెందగా వెయ్యి మంది వరకు గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3 ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల కింద మృతదేహాలు ఉండొచ్చిన స్థానిక మీడియా వెల్లడించింది. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంపం ధాటి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. భూ ప్రకంపనలు ఐదు సార్లు చోటుచేసుకున్నట్టు సమాచారం. హెరాత్ సిటీకి 40 కిలో మీటర్ల దూరం భూకంప కేంద్ర ఉన్నట్టు భూపరిశోధన అధికారులు వెల్లడించారు. బాడ్‌ఘీష్, ఫరాహ ప్రోవిన్స్‌లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు సమాచారం. అధికారులు, రెస్య్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News