Wednesday, January 22, 2025

సూర్యుడిలో శక్తివంతమైన పేలుడు.. రెండురోజుల్లో భూమిపై ప్రభావం?

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఆరేండ్లలో ఎప్పుడూ లేని విధంగా సూర్యుడి అంతర్భాగంలో అత్యంత శక్తివంతమైన పేలుడు జరిగింది. దీనితో సూర్యుడి చుట్టూ ఉండే వలయం కరోనా ద్రవ్యరాశి (సిఎంఇ) పెద్ద ఎత్తున సెకండుకు 2100 కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకువస్తోంది. ఇప్పుడు జరిగిన పరిణామం టైప్ 2 తరహా సౌర ధార్మికశక్తిని వెదజల్లుతోందని అమెరికా ఎయిర్‌ఫోర్స్ నివేదించింది. క్రమేపీ ఇది ఓ మోస్తరు జి2 స్థాయి నుంచి జి 3 సౌర తుపాన్‌గా పరివర్తనం చెందుతుందని విశ్లేషించారు. ఈ నెల 14వ తేదీన సూరీడులో ఈ విస్ఫోటనం చోటుచేసుకుందని, ఇది గణనీయమైన విచ్ఛిత్తికి దారితీసిందని తెలిపారు. ఇంతకు ముందు 2017లో సూర్యుడిలో ఇటువంటి భారీ పేలుడు జరిగింది. ఇప్పటి పరిణామంతో అంతరిక్ష వాతావరణంలో భారీ స్థాయి ప్రభావం ఉంటుందని హెచ్చరికలు వెలువడ్డాయి. నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సంస్థ ఇప్పటి పేలుడను చిత్రీకరించింది. ఇప్పుడు సంభవించిన సోలార్ సైకిల్ 25తో భూ అయస్కాంత క్షేత్ర తుపాన్ నెలకొంటుందని అధ్యయనంలో తేల్చారు.

దీని ప్రభావం శుక్రవారం లేదా శనివారం అంతరిక్షంలో ఉంటుంది. రెండు మూడు రోజులలో సిఎంఇ అత్యంత శక్తివంతమైన రీతిలో భూమికి చేరుకుంటుంది. దీని ప్రభావంతో ఇప్పటికే అమెరికా పై తీవ్రస్థాయి షార్ట్‌వేవ్ బ్లాకౌట్ పరిణామం తలెత్తింది. దీనిని హామ్ రేడియో నిర్వాహకులు గుర్తించారు. కొంత సేపు సిగ్నల్స్ పనిచేయని స్థితిని పసికట్టినట్లు వారు పేర్కొన్నారు. ఇది ఎక్కువ కాలం ఉంటే కమ్యూనికేషన్ వ్యవస్థను ఎక్కువగా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. అత్యంత భయానక రీతిలో ఉండే సౌర తుపాన్‌తో నేరుగా భూమికి , భూవాతావరణానికి సమస్య ఏర్పడకపోవచ్చు. ముందుగా ఈ సోలార్ తుపాన్ ధాటి ముందుగా అంతరిక్ష వాతావరణ పొరలను తాకుతూ ఉండటంతో దీని ప్రభావ తీవ్రత తగ్గుతుందని అంచనావేశారు. అయితే భూమిపై ఈ నెల 17వ తేదీన దీని ప్రభావంతో ఎటువంటి పరోక్ష లేదా గ్లేన్సింగ్ దెబ్బ ఉంటుందనేది అంతుపట్టని రీతిలో ఉంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News