- Advertisement -
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో తుపాన్ భీభత్సం సృష్టించింది. కాలిఫోర్నియా, పశ్చిమ నెవాడాలో భారీ ఈదురుగాలులతో తుపాన్ విరుచుకుపడింది. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు బురదమయం అయ్యాయి. వేగంగా వీస్తున్న గాలుల తాకిడికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని గంటల పాటు కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ ధాటికి ఫ్లోరిడా విమానాశ్రయంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ఈ తుపాన్ బుధవారం రాత్రి శాన్ ఫ్రాన్సిస్కో వద్ద తీరం దాటిందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
Powerful storm hits northern California
- Advertisement -