Monday, December 23, 2024

పవర్ ఫుల్ తెలంగాణ

- Advertisement -
- Advertisement -

‘ఇండియా ట్రెండ్’లో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న వైనం
సిఎం కెసిఆర్ నిబద్ధత, ప్రణాళిక అమలే ఇందుకు తార్కాణం
అందరి అంచనాలు తలకిందులు.. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఆవిర్భావం
తలసరి విద్యుత్ వినియోగంలో
అగ్రస్థానంలో భారతీయ రాష్ట్రాల్లో ఒకటిగా ప్రకాశన
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
అన్ని రంగాలకు నిరంతరాయగా, నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్రం 
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : కరెంట్ వినియోగంలో ‘పవర్‌ఫుల్ తెలంగాణ’ ‘ఇండియా ట్రెండ్’లో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. 24 గంటల కరెంట్ నందించడంతో పాటు మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తోంది. ఈ క్రమంలో ‘పవర్‌ఫుల్ తెలంగాణ’ని తయారు చేసిన శక్తివంతమైన నేత సిఎం కెసిఆర్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో సిఎం కెసిఆర్ నిబద్ధత, ప్రణాళిక అమలుకు ధన్యావాదాలు తెలిపారు. అందరి అంచనాలు తప్పని నిరూపిస్తూ తెలంగాణ క్రమంగా విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఆవిర్భవిస్తోందన్నారు. ఒకప్పుడు తరచుగా కరెంటు కోతలు, అస్థిరమైన విద్యుత్ సరఫరా, పవర్ హాలిడేస్‌తో దెబ్బతిన్న ప్రాంతం ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న భారతీయ రాష్ట్రాల్లో ఒకటిగా ప్రకాశిస్తోందని వెల్లడించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అన్ని రంగాలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్రం మనేదనన్నారు.

గ్రిడ్ విఫలమైనా నిరంతర విద్యుత్ సరఫరా
ఈ ఏడాది మార్చి 2023లో 15,497 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను తీర్చడంలో తెలంగాణ సక్సెస్ అయ్యింది. ప్రభుత్వ సామర్థం నిరూపిత మైందన్నారు. ఆధునిక రింగ్, ప్రధాన పంపిణీ వ్యవస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని, గ్రిడ్ విఫలమైనప్పుడు కూడా నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా నగరాన్ని ‘పవర్ ఐలాండ్‘గా మార్చార న్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలన్న సిఎం కెసిఆర్ దృఢ సంకల్పమన్నారు. ఈ నిర్ణయాత్మక చర్యలన్నీ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News