Wednesday, January 22, 2025

హైడ్రాకు అధికారాలు

- Advertisement -
- Advertisement -

గెజిట్ విడుదల చేసిన గవర్నర్
జీహెచ్‌ఎంసి చట్టానికి సవరణ.. కొత్త సెక్షన్ 374బి ఏర్పాటు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ ప్రొ టెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కు పవర్స్ వచ్చేశాయి. చట్టబద్ధత లేదంటూ విమర్శిం చే వారి వాదనలకు పుల్ స్టాప్ పడింది. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ.. రాష్ట్ర ప్ర భుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై సంత కం చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జి ష్ణుదేవ్ వర్మ గెజిట్‌ను శనివారం విడుదల చేశారు. దీంతో హైడ్రాకు అధికారాలు చట్టబద్ద్ధంగా సంక్రమించినట్టు అయింది.

జీహెచ్‌ఎంసి చట్టం 1955కు సరవణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టంలో మరో సెక్షన్ 374 బిని చేర్చింది. సెక్షన్ 374ఏ అనంతరం 374 బిని రూపొందించిన ప్రభుత్వం ఈ చట్టసవరణను ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. వచ్చే ఆ రు మాసాల్లో ఈ ఆర్డినెన్స్‌ను శాసన సభ సమావేశాల్లో ప్రవేశపెట్టి సభ ఆమో దం పొందాల్సి ఉంది. శాసనసభ ఆమోదం పొందని పక్షంలోనూ మరో ఆరు మాసాలు కూడా ఈ ఆర్డినెన్స్‌ను పొడిగించే అవకాశాలున్నాయనేది న్యా య నిపుణులు వెల్లడిస్తున్నారు.

సెక్షన్ 374 బిలో..

పబ్లిక్ ఆస్తులైనటువంటి భూములు, రోడ్లు, పార్కులు, ప్రజల వీధులు, డ్రేన్స్, నీ టి వనరులు వంటి వాటిని రక్షించడం. జీహెచ్‌ఎంసి గానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ గుర్తించిన ఆక్రమణలపై చర్యలు తీసుకునే అధికారాలను కలిగి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News