సింధూ జలాల నిలిపివేతకు భారతదేశం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చీఫ్ బిలావల్ భుట్టో జర్ధారీ మండిపడ్డారు. భారత్‌కు ఘాటు హెచ్చరికలు వెలువరించారు. ఇక్కడ సింధు జలాలు పొంగిపొర్లుతాయా? లేదా అక్కడ మీ భారతీయ రక్తం కట్టలు తెంకుంటుందా? చూద్ధామా అని ఈ యువ నేత రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. సింధూ నది పాకిస్థాన్‌ది. దీనిని ఏ శక్తి కాదనలేదు. ఇక్కడి ఈ నీటి కోసం పాకిస్థాన్ నెత్తురుపారిస్తుందని కట్టుబాట్లను వీడి పిపిపి నేత వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ర్యాలీని ఉద్ధేశించి ఆయన జనం హూషార్ మధ్య మాట్లాడారు. ఈ క్రమంలో భుట్టో ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ కానీ అంతర్జాతీయ సమాజం కానీ ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలను సహించబోదని,
సింధూ జలాల నిలిపివేత మోడీకే కాదు ఎవరికి సాధ్యం కాదని బిలావల్ హెచ్చరించారు. పాకిస్థాన్ తరతరాల నాగరికతకు , ప్రత్యేకించి మెహెంజోదారో శాసనాల్లో లిఖించి ఉంది. ఇక్కడి సింధూ జలాలకు పాకిస్థాన్ నిక్కమైన నిజమైన కాపలాదారు. హక్కుదారు, హక్కును కాదనే శక్తిని తిప్పికొడుతామని పిపిపి నేత తెలిపారు. ఈ జూనియర్ భుట్టే గతంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా వ్యవహరించాడు. భారత ప్రభుత్వ వైఫల్యంతో కశ్మీర్‌లో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటే, దీనిని కప్పిపుచ్చుకోవడానికి మోడీ సర్కారు ఈ విధంగా నిందలకు దిగుతోందని, ఇటువంటి చర్యలు చెల్లనేరవని భుట్టో హెచ్చరించారు.