Friday, January 10, 2025

పిపిఎస్ మోటార్స్ చారిత్రక మైలురాయి

- Advertisement -
- Advertisement -

దేశంలో 40 వేల ఫోక్స్‌వ్యాగన్ వాహనాల అమ్మకం
తొలి బహుళ రాష్ట్ర డీలర్‌గా ఘనత

హైదరాబాద్ : దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ గ్రూప్‌లో భాగమైన పిపిఎస్ మోటార్స్ నలభై వేల ఫోక్స్‌వ్యాగన్ వాహనాలు విక్రయించిన మైలురాయి చేరామని, తద్వారా ఈ ఘనత నమోదు చేసిన తొలి దేశ బహుళ రాష్ట్ర డీలర్ అయ్యామని ప్రకటించింది. పిపిఎస్ మోటార్స్‌కు దేశంలో ఫోక్స్‌వ్యాగన్‌కు విస్తృత టచ్‌పాయింట్ల నెట్‌వర్క్ ఉన్నది. సంస్థకు ఐదు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో 33 టచ్‌పాయింట్లు ఉన్నాయి. కరోనా మహమ్మారి దరిమిలా ఆటో పరిశ్రమ మాంద్యానికి లోనైనా పిపిఎస్ మోటార్స్ 33 టచ్‌పాయింట్స్‌కు విస్తరించింది. తద్వారా ఫోక్స్‌వ్యాగన్‌కు అతిపెద్ద నెట్‌వర్క్ భాగస్వామి అయింది.

ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న ప్రతి పదవ ఫోక్స్‌వ్యాగన్ వాహనం పిపిఎస్ మోటార్స్ ద్వారానే జరుగుతుండడం గమనార్హం. ఈ సందర్భంగా పిపిఎస్ మోటార్స్ ఎండి రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ, ‘మా ఒకటిన్నర దశాబ్దాల ప్రస్థానంలో ఫోక్స్‌వ్యాగన్‌కు భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉంది. మా కస్టమర్ల నమ్మకం, అందతో 40 వేల కార్ల అమ్మకాల మైలురాయి చేరగలిగాం’ అని తెలిపారు. ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా ఈ ఘనతకు పిపిఎస్ మోటార్స్‌ను అభినందించారు. 40 వేలవ ఫోక్స్‌వ్యాగన్ రిఫ్లెక్స్ సిల్వర్ రంగు విర్టుస్ కంఫర్ట్‌లైన్ కారును హైదరాబాద్‌లోని పిపిఎస్ మోటార్స్ కూకట్‌పల్లి సిటీ షోరూమ్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమంలో అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News