Monday, January 20, 2025

మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతల వెల్లువ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి నందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుని బుధవారం ఇంజనీరింగ్ అధికారులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించిన కారణంగా కొందరికి పదోన్నతులు రావడమే కాక, పరిపాలన సౌలభ్యం కలిగిందని మంత్రికివారు చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావును సన్మానించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమర్థవంతమైన సేవలు అందిస్తూ, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో పిఅర్ ఎస్‌ఇలు, ఈఈలు, డిఈఈలు, ఏఇలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News