Thursday, December 19, 2024

ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావే..

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుగా తేల్చినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేట్ వ్యక్తిని నిందితుడిగా చేర్చారు. ఎస్‌ఐబి మాజీ చీఫ్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఎస్‌ఐబిలోని హార్డ్ డిస్క్‌ల ధ్వంసం కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అని, ఆయన ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు విచారణలో తేలింది. ప్రభాకర్ రావు చెప్పిన నెంబర్లను ప్రణీత్ రావు టాపింగ్ చేసినట్లు బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తున్న క్రమంలోనే ప్రభాకర్ రావు విజిటింగ్ వీసాపై చెన్నై నుంచి అమెరికా వెళ్ళిపోయారు. దీంతో సిట్‌ను ఏర్పాటు చేసిన పోలీసులు వెస్ట్‌జోన్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేశా రు.

ఈ కేసులో ఇప్పటివకు ఎఎస్‌పిలు భూజంగరావు, తిరుపతన్న, మా జీ డిసిపి రాధాకిషన్ రావు, ఇన్స్‌స్పెక్టర్ ప్రభాకర్‌రావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్ రావు కోసం ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతి తీసుకుని రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్న ట్లు తెలిసింది. అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకుని వచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిందిగా ఎవరు ఆదేశించారనే విషయం అప్పటి ఎస్‌ఐబి అధిపతిగా ఉన్న ప్రభాకర్‌రావును విచారిస్తే బయటపడే అవకాశం ఉంది. రాజకీయ నేతల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఇప్పటికే మాజీ డిసిపి రాధాకిషన్ రావు చెప్పిన విషయం తెసిందే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News