Thursday, December 19, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తొలిసారి ఈ కేసుపై స్పందించారు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అఫిడవిట్ ద్వారా తన వివరణ ఇచ్చారు. తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేస్తానన్నారు. అప్పటి డిజిపిలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల పర్యవేక్షణలో పనిచేశానని చెప్పారు. తనపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష ఉంటుందన్నారు.

తాను ఎలాంటా తప్పుడు పనులకు పాల్పడలేదని వివరించారు. కారణం లేకుండానే తనను నల్గొండ నుంచి బదిలీ చేశారని వెల్లడించారు. చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని పేర్కొన్నారు. కెసిఆర్ కులం, తన కులం ఒక్కటే అయినందునే తనను నిందిస్తున్నారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తాను ప్రస్తుతానికి క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, క్యాన్సర్ చికిత్స పూర్తయిన తరువాత ఇండియాకు వస్తానని కోర్టుకు వెల్లడించారు. దర్యాప్తును తప్పించుకోవడానికి పారిపోయాననడం సరికాదన్నారు. కుల ప్రాతిపదికన ఇంటెలిజెన్స్‌లో నియామకం జరగలేదన్నారు. తదుపరి విచారణ 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News