Tuesday, January 28, 2025

కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను పిచ్చోళ్ల చేతికి అప్పగించవద్దు: ప్రభాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

దుబ్బాక: మహిళలకు రిజర్వేషన్ ద్వారా అన్నింటా అవకాశాలు కల్పించిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మంగళవారం మంత్రి హరీశ్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.

Also Read: నేను సీమ వాసి అని లోకేశ్‌కు తెలియదా?: అవినాష్ రెడ్డి

రెండు సార్లు కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం, దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేయడం మన అదృష్టమని ప్రశంసించారు. సంక్రాంతి ముందు గంగిరెద్దుల మాదిరి ఎన్నికల ముందు ఎంతో మంది వస్తారని, వారిని నమ్మొద్దన్నారు. మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను పిచ్చోళ్ల చేతికి అప్పగించవద్దన్నారు. దుబ్బాకకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా మంత్రి హరీష్ రావు సహకారంతో నిధులు మంజూరు చేసుకుంటున్నామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News