Tuesday, December 24, 2024

అన్ని వర్గాలకు సిఎం సమాన ప్రాధాన్యత: చింత ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

Prabhakar sworn as Handloom Development Corporation Chairman

హైదరాబాద్: నారాయణ గూడ టెస్కో కార్యాలయంలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.  ఈ ప్రమాణ స్వీకారానికి మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సీలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గొప్ప అవకాశం కల్పించారని కొనియాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సిఎం కెసిఆర్ సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రభాకర్ ప్రశంసించారు. కెసిఆర్ కు చదువుకొనే రోజుల నుండే చేనేత కార్మికుల సమస్యలు తెలుసని, అట్టడుగు వర్గాల నుండి వచ్చిన  తనలాంటి వాళ్ళకు సిఎం కెసిఆర్ అనేక పదవులు ఇచ్చి గౌరవించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిసిల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రశంసించారు. కెసిఆర్ ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకరావాలని మంత్రులు ఆయనకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News