Wednesday, January 22, 2025

నా కల నిజమైంది

- Advertisement -
- Advertisement -

Prabhas act with big b in Project K

 

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్ – కె’. ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. అమితాబ్ బచ్చన్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. భారతీయ చిత్రాల్లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ఈ మూవీ కోసం స్టూడియోలో ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించారు మేకర్స్. ప్రభాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తెలిపారు. “ప్రభాస్‌తో మొదటి రోజు మొదటి షాట్ పూర్తయింది. అతని ప్రతిభ, హుందాతనం ప్రేమతో నిండిపోయి ఉన్నాయి”అని ట్వీట్ చేశారు. ఇక లెజెండరీ నటుడితో కలిసి నటించడంతో తన కల నిజమైందని ప్రభాస్ అన్నారు. “లెజెండ్ అమితాబ్ బచ్చన్‌తో మొదటి షాట్‌ను పూర్తి చేశాను” అంటూ ఆనందం వ్యక్తం చేశారు ప్రభాస్. వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News