Wednesday, January 22, 2025

ఇటలీలో ఆటా పాట

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపికా పదుకునే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ చిత్రం కల్కి 2898ఎడి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఇటలీకి చిత్ర యూనిట్ వెళ్లి ఓ సాంగ్‌ని కూడా పూర్తి చేశారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్, హీరోయిన్ దిశా పటాని పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో వారిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News