- Advertisement -
కేరళలో కొండచరియల విలయానికి గురైన వయనాడ్ జిల్లాలో పునరావాస కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సిఎండిఆర్‌ఎఫ్)కు తెలుగు సూపర్‌స్టార్ ప్రభాస్ బుధవారం రూ. 2 కోట్లు విరాళం అందజేశారు. జూలై 30న వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి విలయం సృష్టించిన విషయం విదితమే. ‘వయనాడ్ కొండచరియల విలయ బాధితుల కోసం కేరళ సిఎం సహాయ నిధికి ప్రభాస్ బుధవారం రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు’ అని ఆయన సన్నిహిత ప్రతినిధి ఒకరు తెలియజేశారు. వయనాడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సినీ ప్రముఖులలో ప్రభాస్ ఒకరు. ఇంతకు ముందు ఇతర తెలుగు సూపర్‌స్టార్లు చిరంజీవి, రామ్ చరణ్. అల్లు అర్జున్ సిఎండిఆర్‌ఎఫ్‌కు తమ వంతుగా విరాళం ఇచ్చారు.
- Advertisement -