Monday, December 23, 2024

కంటతడి పెట్టుకున్న ప్రభాస్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

కృష్ణం రాజు జ్ఞాపకాలను తెరపై చూస్తూ ప్రభాస్ భావోద్వేగానికి గురయ్యాడు. రెబల్ స్టార్ మృతి పట్ల నటుడు గోపీచంద్, ప్రభాస్‌తో పాటు హోస్ట్ నందమూరి బాలకృష్ణ మౌనం పాటించి సంతాపం తెలిపారు. బాలయ్య ‘అన్ స్టాపబుల్’ లో ప్రభాస్ రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఆ షోలో ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. తన ఎదుగుదల చూసి పెదనాన్న కృష్ణంరాజు ఎంతో గర్వపడేవారని చెప్పే వీడియోను బాలకృష్ణ టెలికాస్ట్ చేశాడు. అది చూసి ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చేతితో కళ్లు తుడుచుకున్నాడు. ఎట్టకేలకు ప్రభాస్ ‘ఐ లవ్ హిమ్’ అంటూ టాపిక్ ముగించాడు. దీనికి బాలకృష్ణ బదులిస్తూ.. ఆ సమయంలో షూటింగ్ నిమిత్తం టర్కీలో ఉండడంతో మిస్ అయ్యానని, ఈ వార్త తెలియగానే ఏడుపు ఆపుకోలేక పోయానని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News