Thursday, January 16, 2025

పెద్ద హీరో అవుతాడనునుకుంటే.. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు

- Advertisement -
- Advertisement -

డార్లింగ్‌గా తెలుగు ప్రేక్షకుల చేత పిలిపించుకునే ప్రభాస్ కేవలం ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఎవరు అనుకోలేదు. కానీ, బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులకు సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇక ఈ స్టార్ హీరో కథానాయకుడిగా పరిచయమై అంటే హీరోగా కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా మంగళవారంతో 20 ఏళ్ళు పూర్తయింది. 2002 జులై 28న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయమవుతూ ఈశ్వర్ అనే సినిమాని మొదలుపెట్టారు. ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు క్లాప్ కొట్టి సూపర్ స్టార్‌గా ఎదగమని దీవించారు.. కానీ ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతాడని అప్పుడు ఆయన ఊహించలేదు. ఇక ప్రభాస్ ఒక్కో సినిమాతో ఎదుగుతూ ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక ఆయన నటిస్తున్న ఆదిపురుష్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా కూడా మారబోతున్నాడు. ఎందుకంటే ఆదిపురుష్ సినిమాను అటు హాలీవుడ్‌లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి మంగళవారానికి 20ఏళ్ళు పూర్తవడంతో ఆయన అభిమానులు ఈ ఇరవై ఏళ్ల ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లో కృష్ణం రాజు ఇంట్లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొందరు అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమాను తెరకెక్కించి, ప్రభాస్‌ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్‌లతో పాటు రెబల్ స్టార్ కృష్ణం రాజు, ఆయన భార్య శ్యామల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

Prabhas ‘Eshwar’ Movie Completed 20 Years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News