Wednesday, January 22, 2025

యోగి రీ-రిలీజ్.. ప్రభాస్ ఫాన్స్ అత్యుత్సాహం.. లక్షల్లో నష్టం

- Advertisement -
- Advertisement -

అమరావతి: తమ అభిమాన నటుల సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. తాజాగా ప్రభాస్ ఫాన్స్ అత్యుత్సాహంతో రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా శ్రీప్రియ థియేటర్లో శుక్రవారం ప్రభాస్ సినిమా యోగి రీరిలీజ్ సందర్బంగా ఫాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు.

అది కాస్త మితిమీరడంతో స్క్రీన్ చింపడమే కాకుండా కుర్చీలు కూడా ధ్వంసం చేసారు. ఈ థియేటర్ ఈ మధ్య కాలంలోనే రెనోవేట్ చేశారు. ఇంతలో ఇలా ధ్వంసం కావడంతో థియేటర్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఇకపై ఈ థియేటర్లో రీరిలీజ్ మూవీస్ ఆడబోవని స్పష్టం చేశారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అటు నంద్యాలలో ప్రభాస్ ఫాన్స్ యోగి రీరిలీజ్ సందర్బంగా సంబరాలు చేస్తూ రాజ్ థియేటర్ స్క్రీన్ దగ్గర డాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో స్క్రీన్ మీద పడగా రెండు చోట్ల చిరిగిపోయి బాగా డామేజ్ అయిందని యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News