Friday, February 21, 2025

ఫౌజీలో కీలక పాత్రలో ఆలియా భట్

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫౌజీ. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీ గా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇం దులో ఆమె యువరాణి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ వార్తపై ఇంకా అధికారికంగా అప్ డేట్ రాలేదు.

కాగా, ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఆయన ఫౌజీ సెట్స్‌లో చేరా రు. అలాగే, ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే హను రాఘవపూడి సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News