పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్అశ్విన్ కాంబినేషన్లో ఓ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. స్టార్ క్యాస్టింగ్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించే ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే నాగ్అశ్విన్ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను ఎంపిక చేశారు. అలాగే కీలక పాత్ర కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ని తీసుకున్నారు. ఇదే క్రమంలో మరికొందరు బాలీవుడ్ స్టార్స్‌ని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలని నాగ్అశ్విన్ ఆలోచిస్తున్నాడట. ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం ఇటీవలే ఓ బాలీవుడ్ స్టార్‌ని సంప్రదించారని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇందులో మరో ఐదు, ఆరుగురు ప్రముఖ హిందీ ఇండస్ట్రీ నటీనటులు నటించే అవకాశం ఉందని తెలిసింది. పాన్ వరల్డ్ మూవీ కావడంతో పలు ఇతర ఇండస్ట్రీల స్టార్స్‌తో పాటుగా విదేశీ నటులను కూడా తీసుకోవాలని డైరెక్టర్ ఆలోచిస్తున్నాడట.
ఇకపోతే ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ జోనర్లో మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించనున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్-విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మేకర్స్ చెబుతున్నారట. దీనికి లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్స్ పూర్తయిన వెంటనే నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
Prabhas film set against 3rd world war backdrop