Monday, December 23, 2024

‘ప్రాజెక్ట్ కె’ నుంచి ప్రభాస్ మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్‌

- Advertisement -
- Advertisement -

సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులని మరోసారి ఆకట్టుకుంది వైజయంతీ మూవీస్. ఈ చిత్ర భారీ తారాగణంలో కమల్ హాసన్ చేరికతో సంచలనం సృష్టించింది. తర్వాత శాన్ డియాగో కామిక్-కాన్‌లో పాల్గొనే మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. తాజాగా విడుదలైన దీపికా పదుకొణె ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అందరినీ సర్ప్రైజ్ చేసింది.

ప్రేక్షకులను కట్టిపడేసేలా వైజయంతీ మూవీస్ ఇప్పుడు ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ ని విడుదల చేసింది. ఇది గొప్ప  సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. సెపియా టోన్డ్ క్యాప్టివేటింగ్ ఇమేజ్‌లో ప్రభాస్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. అద్భుతంగా రూపొందించిన ఫస్ట్ లుక్ విజువల్ ఈ చిత్ర ఎక్స్ టార్డినరీ నిర్మాణ విలువలకు నిదర్శనంగా నిలుస్తోంది.  ఇప్పటికే ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో, ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తించింది.

‘ప్రాజెక్ట్ K’ శాన్ డియాగో కామిక్-కాన్‌లోని ప్రతిష్టాత్మకమైన హెచ్ హాల్‌లో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మహత్తరమైన ఈవెంట్‌లో క్రియేటర్‌లు సినిమా టైటిల్, టీజర్‌ను రివిల్ చేసే మరపురాని ప్రయాణం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ K’లో ఇండస్ట్రీ లోని బిగ్గెస్ట్ స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. ఈ భారీ తారాగణం కలయిక, నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకర్షించే అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని హామీ ఇస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News