Wednesday, January 22, 2025

ఆదిపురుష్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ అప్‌డేట్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ శుక్రవారం ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇక, ఈ సినిమా టీజర్ ను అక్టోబర్ 2న సాయంత్రం 7:11 గంటలకు శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

Prabhas First Look out from ‘Adipurush’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News