Sunday, January 19, 2025

ప్రభాస్‌తోనే నాకు కడుపు వచ్చింది: దీపికా పడుకొణే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పడుకొణే పాల్గొన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుడ్ ప్రియుడు అన్న విషయం తెలిసిందే. ఎక్కడ షూటింగ్ జరిగిన తాను పది మందికి సరిపోయే ఫుడ్ తీసుకెళ్తాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. తాజాగా దీపికా పడుకొణే ఆసక్తికర వాఖ్యలు చేశారు. ప్రభాస్ ఫుడ్‌తోనే తనకు కడుపు వచ్చిందన్నారు. షూటింగ్ జరిగేటప్పుడు ప్రతీరోజు ప్రభాస్ ఫుడ్ తీసుకొచ్చేవాడని, బాగా తినడంతో తన బేబీ బంప్‌లా తయరయ్యానని వివరణ ఇచ్చింది.

ప్రభాస్ రుచికరమైన ఫుడ్ పెట్టించేవాడని కొనియాడారు. ఆయన కేటరింగ్ సర్వీస్ ఉండడంతో సెట్‌లోకి ఐటమ్స్ అన్ని తెప్పించి పెట్టేవాడని చెప్పారు. తన మంచి మనస్సుతో అందరికి భోజనం పెట్టి సంతోష పడేవాడని కొనియాడారు. నాగ్ అశ్విన్ లాంటి దర్శకుడితో పని చేయడం చాలా ఆనందంగా ఉందని, తన కెరీర్‌లో ఈ సినిమాతో మంచి అనుభవం వచ్చిందని చెప్పారు. ఆమె ప్రసంగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కల్కి సినిమాలో జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News