Monday, December 23, 2024

రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించిన ప్రభాస్

- Advertisement -
- Advertisement -

రాజమౌళి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా విదేశాల్లో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల రివార్డులతో పాటు అవార్డులూ అందుకుంటోంది ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రీసెంట్ గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్, లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ పురస్కారాలు దక్కాయి. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణికి ట్విట్టర్ వేదికగా ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు.

గ్రేటెస్ట్ రాజమౌళి గారు సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. బెస్ట్ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ తో పాటు, లాస్ ఏంజెలీస్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ డెరెక్టర్ రన్నరప్ పురస్కారాలు అందుకున్నందుకు నా శుభాకాంక్షలు. అలాగే లాస్ ఏంజెలీస్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డ్ గెల్చుకున్న కీరవాణికి కంగ్రాట్స్ అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. ప్రభాస్ విషెస్ కు స్పందించిన రాజమౌళి… థాంక్స్ డార్లింగ్. నేను ఇంత పేరు తెచ్చుకుంటానని నాకంటే ముందు నమ్మిన వ్యక్తి నువ్వు. అంటూ రాజమౌళి రిప్లై ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News