Wednesday, January 22, 2025

ప్రభాస్ చాలా గొప్ప నటుడు

- Advertisement -
- Advertisement -

Prabhas is great actor

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ రొమాంటిక్ హిందీ మూవీ ‘మైనే ప్యార్ కియా’ ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి భాగ్యశ్రీ. ఈ చిత్రం తెలుగు వర్షన్ ‘ప్రేమ పావురాలు’తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు ఈ అందాల తార. ఆ తర్వాత తెలుగులో రెండు సినిమాల్లో నటించిన భాగ్యశ్రీ పలు హిందీ, మరాఠి, కన్నడ, భోజ్‌పురి సినిమాల్లో నటించారు. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సుమారు రెండు దశాబ్దాల తరువాత ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించారు.

ఈ సినిమాలో ప్రభాస్‌కి తల్లిగా నటించిన భాగ్యశ్రీ మీడియాతో మాట్లాడుతూ “పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ‘రాధే శ్యామ్’ సినిమాలో నేను తల్లిగా నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ చాలా గొప్ప నటుడు. యువి క్రియేషన్స్ వాళ్లు మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమా తీశారు. ఇక ‘మైనే ప్యార్ కియా’ తరువాత నేను కొన్ని సినిమాలు చేశాను.ఆ సమయంలో పెళ్లి చేసుకొంటే ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుందని నేను పెళ్లి చేసుకున్నాను. కొంతకాలం సినిమాలకు దూరమైన నేను ఇప్పుడు మా పిల్లలు పెద్ద అయినందున ఫ్యామిలీ ప్రోత్సహించడంతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News