యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ 3డి, – సలార్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్ని ఇప్పటికే సెట్స్ పైకి తీసుకెళ్లాడు. త్వరలోనే వీటికి సంబంధించిన షెడ్యూల్స్‌ని ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నారు. తదుపరి నాగ్అశ్విన్ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటించేందుకు ప్రభాస్ సంసిద్ధంగా ఉన్నాడు. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తాడు. తాజా సమాచారం మేరకు ఇందులో రాశీ ఖన్నా కూడా ఒక కథానాయికగా నటిస్తుందని తెలిసింది. ప్రస్తుతం రాశీతో నిర్మాతలు మంతనాలు సాగిస్తున్నారని వెల్లడైంది. రాశీ పాత్ర ఎలా ఉంటుంది? అన్నది అటుంచితే ఇది నిజంగానే క్రేజీ ఆఫర్. ఆమెకు ఇదే తొలి పాన్ ఇండియన్ సినిమా. పైగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో ఆఫర్ అనగానే రాశీ దశ దిశ తిరిగిపోవడం ఖాయమేననడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా వల్ల షెడ్యూల్ పోస్ట్‌పోన్ అయింది. 2022లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి 2023లో విడుదల చేస్తారట.