Thursday, December 26, 2024

ప్రభాస్ జాయిన్.. శరవేగంగా ‘ఫౌజీ’ షూటింగ్

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ తన నెక్స్ మూవీని దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రారంభించాడు. ఇక ఈ రెండు సినిమాలపై ఈ స్టార్ హీరో ప్రస్తుతం పూర్తి దృష్టి పెట్టాడు. హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ రెండు వైవిధ్యమైనా పాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

అయితే హీరో లేని సీన్లు తెరకెక్కిస్తున్నారట మేకర్స్. అటు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న పీరియాడిక్ వార్ మూవీ ‘ఫౌజీ’ రెగ్యులర్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ ఇటీవల చేరాడు. పలు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట మేకర్స్. ఈ సినిమాతో అందాల భామ ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఇలా ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలు కూడా బిజీగా షూటింగ్ జరుపుకుంటుండటం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News