Monday, December 23, 2024

‘కల్కి 2898ఎడి’..త్వరలో మరో టీజర్

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే, దిశా పటానిలు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898ఎడి’. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి భారీ స్టార్స్ నటిస్తున్న ఈ భారీ చిత్రం విడుదల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర టీజర్ వస్తుందని తెలిసింది.

ఇక ఈ టీజర్‌ను 1 నిమిషం 23 సెకండ్స్ నిడివితో మేకర్స్ కట్ చేస్తున్నారట. మరి ఇప్పుడు ఆ పనులు శరవేగంగా పూర్తి చేస్తుండగా… టీజర్ రిలీజ్‌పై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘కల్కి 2898ఎడి’ సినిమాను మేకర్స్ మే 9న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News