Sunday, December 22, 2024

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో కలిసి పనిచేయడం నా అదృష్టం: ప్రభాస్

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఎడి నిర్మాతలు కస్టమ్-మేడ్ వాహనాన్ని విడుదల చేయడానికి హైదరాబాద్‌లో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. బుజ్జిని ప్రపంచానికి పరిచయం చేయడానికి దాదాపు 1 నిమిషం నిడివి గల టీజర్ ను కూడా విడుదల చేశారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఈ వేడుకలో కస్టమ్ మేడ్ వెహికల్ బుజ్జి బిల్డింగ్ వెనుక ఉన్న టీమ్ ని నాగ్ అశ్విన్ పరిచయం చేశాడు. “బుజ్జి పేరు చిన్నగా అనిపించినా అది మాకు చాలా ప్రత్యేకమైనది. కల్కి 2898 ఎడి చాలా కష్టమైన చిత్రం. నేను ఇంజనీరింగ్ చేయలేదు. నేను సహాయం కోసం ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశాను.

అతను తన బృందాన్ని యాక్టివేట్ చేశాడు. వారు మమ్మల్ని కోయంబత్తూర్ లోని జయం మోటార్స్ కు తీసుకువెళ్లారు. ఇది చాలా ప్రయోగాత్మక రేసింగ్ కార్-బిల్డింగ్ కంపెనీ. భారీ పరిశోధనతో ఇలాంటి ఫీచర్లతో కూడిన కారును తయారు చేశారు”అని అన్నారు. ఇక ఈ వేడుకలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా ఈవెంట్‌కి ఎంట్రీ ఇచ్చాడు. బుజ్జి మీద వేదిక మీదకు వచ్చాడు. అతను తన డేర్-డెవిల్ స్టంట్‌లతో అబ్బురపరిచారు.

తాను బుజ్జిని నడిపిన తీరు చూస్తే ఆ కారుతో తనకి ఉన్న అనుబంధం అర్ధమవుతుంది. ఇక భైరవ గెటప్‌లో వేదిక మీదకు ప్రవేశించిన ప్రభాస్ సినిమా తీయడానికి పడిన కష్టాన్ని వెల్లడించాడు. మేకర్స్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ “నా దర్శకుడు నాగ్ అశ్విన్ నన్ను 3 సంవత్సరాలు టార్చర్ పెట్టాడు. ఇక బుజ్జి చాలా ప్రత్యేకం. బుజ్జి టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం”అని తెలిపారు. ఈ వేడుకలో నిర్మాత సి.అశ్వనీదత్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News