Tuesday, January 21, 2025

బర్త్‌డే కానుకగా…

- Advertisement -
- Advertisement -

Prabhas-Maruthi film first look on Oct 23

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ హారర్ థ్రిల్లర్‌ని చేయబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ భారీ పాన్ ఇండియా మూవీని టి.జి.విశ్వప్రసాద్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఆ మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర బృందం సినిమాని పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మంగళవారం ఈ మూవీ కోసం హీరో ప్రభాస్‌పై లుక్ టెస్ట్‌కి సంబంధించిన ఫొటో షూట్ ని పూర్తి చేసినట్లు తెలిసింది. ఇక ఈనెల 23న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజున ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని విడుదల చేయబోతున్నారట. ఆ కారణంగానే ప్రభాస్‌పై లుక్ టెస్ట్‌కి సంబంధించిన ఫొటో షూట్‌ని చిత్ర బృందం పూర్తి చేపినట్టుగా సమాచారం.

‘రాజా డీలక్స్’ అనే ఓ సినిమా హాల్ నేపథ్యంలో సాగే హారర్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరపైకి తీసుకురానున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్ ని కూడా నిర్మిస్తున్నారట. ఇక ఇందులో ప్రభాస్ తాతా మనవళ్లుగా డ్యుయల్ రోల్‌లో కనిపిస్తారని, సినిమా రెండు కాలాల్లో సాగే కథగా వుంటుందని తెలిసింది. ఇక ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు క్రేజీ హీరోయిన్ లు నటించబోతున్నారు. ఇప్పటికే ఇద్దరిని మారుతి ఫైనల్ చేశారు. ‘మాస్టర్’ ఫేమ్ మాళవికా మోహనన్ ఒకరు కాగా మరొకరు నిధి అగర్వాల్. మరో క్రేజీ లేడీని త్వరలోనే ఎంపిక చేయనున్నారట. బుధవారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ షూటింగ్ వారం రోజుల పాటు ఏక ధాటిగా సాగుతుందని తెలిసింది.

Prabhas-Maruthi film first look on Oct 23

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News