Thursday, January 23, 2025

డిఫరెంట్ ఫన్ ఫిల్మ్..

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలే. అన్నీ వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న సినిమాలే అయినా అనూహ్యంగా ప్రభాస్… మారుతి దర్శకత్వంలో ఒక చిన్న బడ్జెట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. అయితే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే 2023 దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సినిమా మూడో షెడ్యూల్ కూడా ఈ నెల 27 నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ ఈ సినిమా ఒకే షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పడింది సినిమా యూనిట్. తాజా సమాచారం మేరకు ఈ మూడో షెడ్యూల్‌లో ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా చేస్తున్నారని ఈ సీక్వెన్స్ లో మాళవిక మోహనన్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలిసింది. ఈ సినిమాలో మాళవిక మోహన్ సహా మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. రెండో హీరోయిన్ పేరు నిధి అగర్వాల్ అంటున్నా మూడో హీరోయిన్‌గా ఎవరుంటారు అనే విషయం మీద క్లారిటీ లేదు.

హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న కార్తీక్ పలని ఒక అప్‌డేట్ ఇచ్చారు. విజయ్ ‘వారసుడు’ సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన కార్తీక్ పలని ఆ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ సినిమా గురించి అసలు విషయం బయట పెట్టాడు. నిజంగానే ప్రచారం జరుగుతున్నట్లుగా ఇది ఒక ఫన్ ఫిల్మ్ అని కార్తీక్ తెలిపాడు. సినిమా ఏ మాత్రం హెవీగా అనిపించదని ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటికీ పూర్తి భిన్నంగా ఉంటుందని కార్తీక్ చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News