Friday, January 10, 2025

భారీ సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్

- Advertisement -
- Advertisement -

Prabhas new film poster to release on his birthday

‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా భారీ క్రేజ్ తెచ్చుకున్నారు ప్రభాస్. నిర్మాతగా ఉన్న తండ్రి సూర్య నారాయణ రాజు, హీరోగా చేసిన పెద్దనాన్న కృష్ణం రాజు తర్వాత వారసుడిగా ‘ఈశ్వర్’తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, సాహో లాంటి భారీ విజయాలని సాధించారు. 20 ఏళ్ళ కెరీర్‌లో పేక్షకుల హృదయాల్లో మకుటం లేని మహారాజులా ఎదిగిన ప్రభాస్ ఆదివారం తన పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చిత్రాల కోసం టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

నేషనల్ అవార్డు గెలుచుకున్న ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ ఇందులో రాఘవ రాముడిగా కనిపించనుండగా… పూర్తి 3డి టెక్నాలజీతో 250 కోట్ల విజువల్ ఎఫెక్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్… ప్రభాస్ హీరోగా డార్క్ సెంట్రిక్ థీం టెక్నాలజీని వాడుతూ రూపొందిస్తున్న భారీ చిత్రం ’సలార్’. ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్‌లో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ’ప్రాజెక్ట్ కె’పై భారీ అంచనాలున్నాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకున్ లాంటి పాన్ ఇండియన్ స్టార్లతో ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదికాక ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో, దర్శకుడు మారుతితో కూడా ప్రభాస్ భారీ చిత్రాలు త్వరలో మొదలు కానున్నాయి.

Prabhas new film poster to release on his birthday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News