Saturday, December 21, 2024

జోరు తగ్గని ప్రభాస్…ఫుల్ బిజీ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడి’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నటుడు ప్రభాస్ చాలా హ్యాపీగా ఉన్నాడు. తన తదుపరి చిత్రాల తయారీలో తలమునకలై ఉన్నాడు. తాజాగా ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ డ్రామా యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. అది నేడు అంటే ఆగస్టు 17న అధికారికంగా, ఘనంగా హైదరాబాద్ లో లాంచ్ అయింది. పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ లాంచింగ్ కార్యక్రమానికి తన విలాసవంతమైన నల్ల రంగు రేంజ్ రోవర్ కారులో వచ్చాడు. ఇప్పుడు ఆ కారు గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. దాని ఖరీదు రూ. 2.7 నుంచి 3 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. ప్రభాస్ ఆ కారులో వచ్చే వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రభాస్  చిత్రం ‘ఫౌజీ’ ఆగస్టు 24 నుంచి హైదరాబాద్ లో షూట్ కానున్నది. ఈ సినిమా కథ స్వాతంత్ర్యానికి మునుపటి భూమిక ఉన్న కథ అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఐమన్ ఇస్మాయిల్ అనే హిరోయిన్ తొలిసారి నటించబోతున్నది. లాంచింగ్ ఈవెంట్ లో ఈమె కూడా ప్రభాస్ ప్రక్కన కనిపించింది. ప్రభాస్,  మారుతి తీస్తున్న ‘రాజా సాబ్’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. దానిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తోంది. ఆ సినిమా 2025 వేసవి కాలంలో విడుదల కానుంది. ఇంకా ప్రభాస్, సందీప్ వంగ తో కూడా ఓ సినిమా తీయబోతున్నాడని టాక్.

ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ తీరిక లేనంత ఊపు మీద ఉన్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ప్రభాస్ కి సినిమా రంగంలో మంచి పెయిర్ అనిపించుకున్న త్రిష, అనుష్కలతో కూడా సినిమాలు చేస్తే బాగుంటుందని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒక ‘వర్షం’, మరో ‘బాహుబలి’ వంటి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News