Wednesday, January 22, 2025

బర్త్‌డేకు ‘రాజా సాబ్’ కానుక

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ ‘రాజా సాబ్’ నుంచి రెబల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్’ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి ఏర్పడుతోంది. ‘రాజా సాబ్’ అప్డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

‘రాజా సాబ్‘ సినిమాలో ప్రభాస్ లుక్, మేకోవర్ చాలా కొత్తగా ఉండబోతోంది. సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘రాజా సాబ్’ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్‌గా నిర్మిస్తోంది. ‘రాజా సాబ్’ పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ‘రాజా సాబ్’ చిత్రీకరణ తుది దశలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News