Monday, December 23, 2024

ఈ రాతలే..

- Advertisement -
- Advertisement -

Prabhas Pooja hegde act in Radhe shyam Movie

రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి ‘ఈ రాతలే’ లిరికల్ వీడియో ప్రోమో విడుదలైంది. ఈ మధ్యే విడుదలైన లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఈ కలర్‌ఫుల్ వీడియో ప్రోమోకు అనూహ్య స్పందన వస్తోంది. ఫుల్ వీడియో సాంగ్ శుక్రవారం విడుదల కానుంది. ఈ లిరికల్ సాంగ్ చూస్తే.. పాటలో 5 అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం పంచ భూతాలుగా పిలుచుకునే నిప్పు, ఆకాశం, నీరు, భూమి, గాలి.. ఈ లిరికల్ వీడియోలో చూపించారు.

దీని కాన్సెప్ట్ ఏమిటంటే.. ప్రేమించే వాళ్ళ కోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించి వాళ్లను చేరుకోవడం. ఈ పాటలో హీరోయిన్ కోసం హీరో అలాంటి కష్టాలు పడతాడు. సినిమా విడుదలైన తర్వాత ఈ పాట గురించి పూర్తిగా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని చిత్ర యూనిట్ చెబుతోంది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ‘రాధే శ్యామ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మార్చి 11న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News