Monday, January 20, 2025

ప్రశాంత్ నీల్‌తో మైథలాజికల్ సినిమా..

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమాలతో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఆదిపురుష్, సలార్ పార్ట్ 1 సినిమాలు ఈ ఏడాది రిలీజ్ ఫిక్స్ చేసుకోగా ప్రాజెక్ట్ కె సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక సలార్ పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ కూడా కొంత భాగం పూర్తయిందని తెలిసింది. ఇదిలాఉంటే ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ మరోసారి ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తాడట.

Also Read: దానికోసమే ‘అంఖడ’ మూడుసార్లు చూశా: రాఘవ లారెన్స్ ఇంటర్వ్యూ..

దిల్ రాజు బ్యానర్‌లో ఈ సినిమా రాబోతుంది. ఇక ప్రభాస్‌తో సలార్ 1, 2 తర్వాత ప్రశాంత్ నీల్ తీసే సినిమా మైథలాజికల్ మూవీ అని అంటున్నారు. ప్రభాస్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఉన్నాడని తెలిసింది. సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలన్నీ పూర్తి చేసి త్వరగా ప్రశాంత్ నీల్‌తో మైథలాజికల్ మూవీ ప్రారంభించాలని చూస్తున్నాడు. మధ్యలో మారుతి సినిమాను కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశాడు ప్రభాస్. మొత్తానికి ప్రభాస్‌తో దిల్‌రాజు భారీ మూవీని ప్లాన్ వేశాడని చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News