Thursday, January 23, 2025

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్ అప్పుడే

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ల ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ కె’ దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. ప్యాన్ వరల్డ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సినిమా కోసం మేకర్స్ పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. ప్రాజెక్ట్ కె జనవరి12, 2024న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

యుద్ధ సన్నివేశంలో విడుదల చేసిన అద్భుతమైన రిలీజ్ పోస్టర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. ముగ్గురు వ్యక్తులు భారీ చేతికి తుపాకీని గురిపెట్టి చూస్తున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో మైదానంలో ఆయుధాలతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ప్రపంచం ఎదురుచూస్తోంది… అని పోస్టర్ పై రాసివుంది. ఇండియాలో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచిన ఈ అద్భుతమైన సినిమా విడుదల కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.

దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమా మరో లెవల్‌గా ఉండబోతోంది. విజయవంతంగా 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకుంటున్న ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మాణంలో ఈ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అశ్విని దత్ నిర్మాత. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మేకర్స్ గతంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణెల ప్రీ-లుక్ పోస్టర్‌లను వారి పుట్టినరోజుల సందర్భంగా విడుదల చేశారు. చిత్ర యూనిట్ త్వరలో భారీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News