Monday, December 23, 2024

‘రాజాసాబ్’గా డార్లింగ్.. ఫస్ట్ లుక్ అదిరింది..

- Advertisement -
- Advertisement -

డార్లింగ్ ప్రభాస్-డైరెక్టర్ మారుతిత కాంబినేషన్ తెరుకెక్కుతున్న చిత్రం టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ పంచెకట్టులో హుషారుగా నడుస్తున్న పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మాస్ లుక్ లో వింటేజ్ డార్లింగ్ ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ మూవీకి రాజాసాబ్ అనే టైటిల్ మేకర్స్ ఖరారు చేశారు.

ప్ర‌స్తుతం ఈచిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇందులో ప్రభాస్ కు జోడీగా ఎవరు నటిస్తున్నారనేది ఇంకా మేకర్స్ వెల్లడించలేదు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా, ప్రభాస్.. ఈ సినిమాతోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే పాన్ వరల్డ్ చిత్రం చేస్తున్న విషయం తెలిసందే. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News