Wednesday, January 22, 2025

బాక్సాఫీస్ దద్దరిల్లింది.. ‘సలార్’ కలెక్షన్లు ఎంతో తెలుసా?

- Advertisement -
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సూపర్‌స్టార్‌లలో ప్రభాస్ ఒకరు. బాహుబలితో హృదయాలను గెలుచుకున్న తర్వాత, ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోగలిగాడు. తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, టిన్ను ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, రామచంద్రరాజు కీలక పాత్రలు పోషించారు.

యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన సలార్ మొదటి రోజు నుండే బాక్సాఫీస్ దద్దరిల్లేలా చేసి రూ.180 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లో భారీ వస్తూళ్లను రాబట్టింది. సలార్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటేస్తోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ రీజన్ లో అడ్వాన్స్ గ్రాస్ విషయంలో ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ ని సలార్ బ్రేక్ చేసింది. 12 కోట్లకు పైగా రాబాట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. నైజాం మార్కెట్ లో ప్రభాస్ హవా దుమ్ములేపుతోంది. నైజాం ఏరియాలో సలార్ 22.55 కోట్లు వసూళ్లు రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే 32 కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.

గతంలో బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఏది ఏమైనప్పటికీ, హిందీ భాషలో వారి అద్భుతమైన ప్రదర్శన కారణంగా సినిమాలు మార్కును సాధించగలిగాయి. బాహుబలి 2 హిందీలో రూ.510 కోట్లు రాబట్టగా, ఆర్‌ఆర్‌ఆర్ రూ. 275 కోట్లు వసూలు చేసింది. మరోవైపు, KGF 2 హిందీలో రూ. 435 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News