Sunday, December 22, 2024

డిసెంబర్ 22న ప్రభాస్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ సినిమా రిలీజ్ డేట్‌ను హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. భారీ మాస్ యాక్షన్‌తో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న థియేటర్లోకి రాబోతోందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. సలార్ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి. సలార్ ప్రపంచాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఆడియెన్స్ ఎదురుచూడసాగారు.

హోంబలే సంస్థ ఇప్పుడు ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. యువ, కాంతారా 2, రఘు తాత, రిచర్డ్ ఆంటోని, కేజీయఫ్ 3, సలార్ పార్ట్ 2, టైసన్ వంటి సినిమాలతో మున్ముందు ప్రేక్షకులను థ్రిల్ చేయబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News