Monday, December 23, 2024

సలార్ ట్రైలర్ వస్తోంది!

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక, ఇటలీ వెళ్లి మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న డార్లింగ్ ప్రభాస్, రెండు రోజుల క్రితమే ఇండియా తిరిగి వచ్చాడు. వచ్చీరాగానే సలార్ ప్యాచ్ వర్క్ పనుల్లో మునిగిపోయాడు. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సలార్ కు సంబంధించిన ఓ శుభవార్త ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది.

ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 1న విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందట. సోషల్ మీడియాలో ఈ వార్తలో వైరల్ అవుతోంది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా, సలార్ అభిమానులు మాత్రం వేడుకలు చేసుకుంటున్నారు. కేజీఎఫ్ వంటి భారీ చిత్రాన్ని తీసి, సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంతో సలార్ పై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News