Monday, December 23, 2024

పారితోషికం వద్దు…కానీ… : ప్రభాస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యావత్ భారత దేశంలోనే ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. అతడి కీర్తి ‘బాహుబలి’తో ప్రపంచ స్థాయికి కూడా పెరిగింది. అయితే సినిమాకు రూ. 150 కోట్లు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగాడు. బాహుబలి సినిమాకు రూ. 100 కోట్లు పారితోషికం తీసుకున్నాడని వినికిడి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆయన తన రాబోయే చిత్రం ‘రాజా డీలక్స్’కు పైసా కూడా ఛార్జీ చేయడం లేదట.

పారితోషికంకు బదులుగా లాభాల్లో వాటా కోరాడట. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  తనకు, సినిమాకు కూడా మేలు చేస్తుందని అతడు భావిస్తున్నాడట. ప్రభాస్ ఈ సహృదయత ఆయన అభిమానుల హృదయాలను గెలుచుకోవడమే కాదు, ఇండస్ట్రీకి ఓ ప్రమాణాన్ని కూడా ఏర్పాటు చేయగలదని భావిస్తున్నారు. ప్రభాస్ ‘రాజా డీలక్స్’లోనే కాదు, ‘ఆదిపురుష్’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అది 2023 జూన్‌లో థియేటర్లలోకి రానున్నది. ఓమ్ రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆ చిత్రంకు ప్రభాస్ రూ. 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన ఇంకా ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ , ‘స్పిరిట్’ అనే సినిమాల్లో కూడా నటిస్తున్నారు. సలార్ సినిమాకు ఆయన రూ. 100 కోట్లు తీసుకున్నారని వినికిడి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News