Saturday, January 11, 2025

మన లైఫ్ లోకి స్పెషల్ వ్యక్తి వస్తున్నారు: ప్రభాస్ ఆసక్తికర పోస్ట్

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త చెప్పబోతున్నారు. స్వయంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. శుక్రవారం తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. డార్లింగ్స్.. ఫైనల్లీ చాలా స్పెషల్ వ్యక్తి మన లైఫ్ లోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ.. ప్రభాస్ పెట్టిన పోస్ట్ అర్థమేంటని కొందరూ ఆలోచిస్తుండగా.. ఇంకేముంటుంది.. త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని..దాని గురించే పోస్ట్ పెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ఇటీవల హీరోయిన్ అనుష్క కూడా పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు, ప్రభాస్ పోస్ట్ పెట్టడంతో..వీళ్లద్దరూ పెళ్లి చేసుకుంటున్నారా? అనే అనుమానాలను సైతం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ప్రభాస్, అనుష్క పెళ్లిపై అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News