Thursday, December 26, 2024

చిన్న చిత్రానికి ప్రభాస్ సపోర్ట్

- Advertisement -
- Advertisement -

చిన్న చిత్రాలకు తమ వంతు బాధ్యతగా మద్దతు ఇచ్చేందుకు పెద్ద హీరోలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. లవ్ రెడ్డి చిత్రాన్ని ప్రొత్సహిస్తూ ఇన్‌స్టా వేదికగా తన మద్దతు ప్రకటించారు. లవ్ రెడ్డి చిత్రానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలు తన దృష్టికి వచ్చాయని, ఇటీవల కాలంలో విడుదలైన ప్రేమ కథల్లో లవ్ రెడ్డి మంచి చిత్రంగా నిలువడం ఆనందంగా ఉందని ప్రభాస్ తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాలో తన అభిమానుల కోసం లవ్ రెడ్డి ట్రైలర్‌ను షేర్ చేస్తూ ఆ చిత్రానికి అండంగా నిలువాలని ప్రభాస్ కోరారు. ప్రభాస్ లాంటి అగ్ర హీరో లవ్ రెడ్డి చిత్రానికి అండగా నిలువడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News