Saturday, January 11, 2025

ఆ స్టార్ డైరెక్టర్‌తో ప్రభాస్ మూవీ?

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ’రాధేశ్యామ్’ చిత్రంతో దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ రిలీజ్ తరువాత ఈ స్టార్ హీరో భుజం గాయం కారణంగా ప్రత్యేక ఆపరేషన్ కోసం స్పెయిన్ వెళ్లారు. అక్కడి డాక్టర్ల సలహా మేరకు మైనర్ ఆపరేషన్ చేయించుకున్న ప్రభాస్ ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడట. అయితే ఆపరేషన్ కారణంగా ఆయన తదుపరి చిత్రం ‘సలార్’ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఆపరేషన్ తరువాత డాక్టర్లు రెండు నెలల పాటు ప్రభాస్‌ని విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ‘సలార్’ షూటింగ్ మరింత ఆలస్యం కానుందని తద్వారా రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం వుందని చెబుతున్నారు. ఈ మూవీతో పాటు ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె, సందీప్ వంగాతో చేయబోతున్న ‘స్పిరిట్’ చిత్రాలు కూడా మరింత ఆలస్యం కాబోతున్నాయట. ఇదిలా వుంటే ప్రభాస్ స్పెయిన్ వెళ్లడానికి ముందు స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రత్యేకంగా సమావేశమయ్యారని సమాచారం. ఇద్దరి మధ్య ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చ జరిగిందని ఇదే సందర్భంగా దర్శకుడు కొరటాల శివ.. హీరో ప్రభాస్‌కు స్టోరీ కూడా వినిపించాడట. స్టోరీ నచ్చడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. ఈ మూవీని యువి క్రియేషన్స్ నిర్మించే అవకాశం వుందని తెలిసింది. ప్రభాస్ నటించిన ’మిర్చి’ చిత్రంతో కొరటాల శివ డైరెక్టర్‌గా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మళ్లీ ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయాలని కొరటాల శివ ప్రయత్నాలు చేస్తున్నాడట. అది త్వరలోనే కార్యరూపం దాల్చబోతోందని అంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రీకరణ దశలో వున్నాయి. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సెట్స్ పైకి రావాల్సి ఉంది. మధ్యలో మారుతి సినిమా అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే కాబోతోంది. కొరటాల శివ త్వరలో ఎన్టీఆర్‌తో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కాబోతోంది.

Prabhas talks Koratala Siva for movie again?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News