Tuesday, September 17, 2024

ప్రభాస్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెసిందే. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా శనివారం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ప్రభాస్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ‘హు ఈజ్ విక్రమాదిత్య’ అంటూ ప్రభాస్ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఈ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

Prabhas Teaser Released from ‘Radhe Shyam’

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News